Friday 14 October 2022

Yadari Prayanam




మీకు ఒకడి కధచెప్పాలి అలాని  వీడు ఏమి మహానుభావుడు కాదు అనుకోండి, అలాని మనం అందరం గొప్పవాలము కాదు ఎందుకు అంటే తప్పులే చేయని వాడు మనిషే కాదు కానీ మనమందరం ఎం అనుకుంటాం అంటే నేను మంచివాడిని అని, ఆలా మనకి మనం సర్దిచెప్పకపోతే  బ్రతకలేం. ఈ సోది అంత ఎందులెండి కథలోకి వెళదాం … 


వీడిది ఓ చిన్న జాబ్ అదేనండి సాఫ్ట్వేర్ జాబ్, ఉనంతలో బండి లాగిఇంచేస్తునాడు ఆలా కొంత దూరం ప్రయాణం తరువాత వీడికి ఎడారి తగిలింది, వెనక్కి వెళ్ళలేడు, వెన్నక్కి వెళ్లడానికి వీడు దేవుడు కాదె ముందుకు వెళ్లడం తప్పు వేరే దారే లేదు. అప్పుడు వీడికి ఓ ఆలోచన వచ్చింది నేను ఓ టైం మెషిన్ కనిపెట్టి వెన్నికి వెళితే నా దారి మార్చుకోవచ్చు అని. 


 అరె… వీడికి బుర్ర ఏమైనా దొబ్బిందా టైం మెషిన్ కనిపెడతాడు అంట, ఇప్పటివారు కనిపెట్టిన వాటిలో సగంపైగా మనిషిని బద్దకస్తుని చేసేవి లేదా మనిషి ఉనికిని నాశనం చేసేవేకదా, వీడు టైం మెషిన్ కనిపెటేస్తాడు అని కాదు తొక్కలో ఆల్రెడీ కనిపెట్టిన వాటినే మళ్ళి కనిపెట్టలేని వెధవకి ఈ తింగరి ఐడియా ఎందుకు చెప్పండి.

వీడు ఇలాంటి తింగరి ఆలోచనలతో,  భయం తో ఆ ఎడారిలో ప్రయాణం మొదలపెట్టాడు కొంత దూరం వెళ్లే సరికే ఓ చిన్న ఇసుక సుడిగాలు వీడి చుట్టూ మొదలయ్యాయి, ఈ వెదవ కి కొంత బుర్ర వుంది ఇలాంటి ఎడారి ప్రయాణం లో ఇసుక సుడిగాలులు సహజం అని తెలుసు. ఆలా వెళుతూ వున్నాడు వాడి నడకతో పాటు వాడి చుట్టూ ఇసుక సుడిగాలు పెద్దవి అవుతూ బయట ప్రపంచం కనిపించని అంతగా వాడిని చుట్టుముట్టాయి అందులోని ఇసుక రేణువులు వాడిని వేగం గా తాకుతున్నాయి, ఆ చిన్న ఇసుక రేణువులు ఓ గులక రాయితో ఓ మనిషిని ఈచ్చి కొడితే ఎలావుందో అలావుంది వాడికి ఆ నొప్పికి వాడి అరుపులు కూడా బయటకి వినిపించటం లేదు, మరి నాకు ఎలా వినిపించింది అని అడగకండి ఎందుకు అంటే వాడే నేను నేనే వాడు. ఐన వాడు తన చుట్టూ వున్నా సుడివలయం చిన్న గ్యాప్ వస్తే తపించు కుందాం అని చూస్తున్నాడు ఎంతైనా మనిషి కదా ఎందుకు అంటే మనిషి అంటేనే ఆశ జీవి అందులలో మిడిల్క్లాస్ మనిషి అంటే ఆశలు చాలాఎక్కువ. ఆలా తపించు కునే దారులు వెదుకుతున్న వాడి కళ్ళలోకి కొన్ని ఇసుక రాళ్ళూ తగిలాయి దెబ్బకి కళ్ళ వెంట కన్నీళ్లు కమ్మేశాయి తొక్కలో ఇంకా దారిఎలా కనిపిస్తుంది, వాడిని కాపాడే చేయీ ఒకటి వుంది కానీ ఇప్పుడు అందనంత దూరంలో వుంది ఆ చేయీ వాడిని సుడిగాలి నుండి కాపాడుతుందో లేదో వీడికి కూడా తెలియదు. ఒకానొక సమయంలో వీడి తొక్కలో మనసు ఈ ప్రయాణం ఆపెదాం అంది అలాఅనుకొని నడక ఆపడానికి ప్రయత్నం చేసాడు కూడా. 


కొంచం దైర్యం తెచ్చుకుని వొంటి కి తగులుతున్న గాయాలు తట్టుకోవచ్చు నడవచు కూడా, కంటికి తగులు తున్న రాళ్ళని తన చేతులు అడ్డు పెట్టుకుని ఓర కంటి తో ఆ ఎడారి దారి చూస్తూ మొండి దైర్యం తో ప్రయాణం మొదలు పెట్టాడు. ఎరా ప్రయాణం ఆపెదాం అనుకున్నావు మళ్ళి మొదలెట్టావ్ అన్న అందుకు వాడు చెప్పిన సమాధానం తో నాకు దిమ్మ తిరిగింది వీడి మీద నాకు కొంచం రెస్పెక్ట్ వచ్చింది. 







వాడు ఇచ్చిన సమాధానం ఏమంటే …. 


శివయ్య ఇచ్చిన ప్రాణం, ఆ శివయ్యాయే నిర్ణయంచిన ప్రయాణం ఈ ఇసుక సుడిగాలుల మధ్యనే ఈ ఎడారి దాటాలని ఆ శివయ్య నిర్ణయం ఐతే ఈ ప్రయాణం చేసితీరుతా, ఈ ప్రయాణం లో నేను ఎందుకు పుట్టానో ఈ భూమి పై అనేది తెలుసుకుంటా అన్నాడు. 


జ్ఞానోదయం ఎవరికైనా ఎప్పుడైనా జరగొచ్చు మనం చెప్పలేం కానీ ఎలా జరిగింది ఈ కనీవిప్పు అనేది మాత్రం వాళ్లకే తెలుస్తుంది. మనం చేయ గలిగేది ఒకటే అల్ ది బెస్ట్ చెప్పటం. 


                                                                                                                             D.Go


Che